
బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుల ఇండ్లలో పరిశ్రమలలో జూన్ 20, 2024 తెల్లవారుజామున నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డితో కుటుంబ సభ్యులతో పాటు, ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి.
గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇంటితో పాటు లక్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమలో కూడా ఈడీ సోదాలు చేశారు. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి భూగర్భగనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజిని ఎగవేసినట్టు ఈడీ రైడ్ లో తేలింది. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్టు బయటపడింది.
సీనరేజి, పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డి రూ. 3 వందల 41 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో గతంలో మధుసుదన్ రెడ్డి జైలుకి వెళ్లివచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.