గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ.. ఏపీ గొర్రెల కాపరుల విచారణకు నోటీసులు..

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ.. ఏపీ గొర్రెల కాపరుల విచారణకు నోటీసులు..

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచింది ఈడీ. సెప్టెంబర్ 15న విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. గొర్రెల స్కాంలో మోసపోయారంటూ ఇప్పటికే ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ఎంటరైంది ఈడీ. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు బ్రోకర్లు రెండు కోట్ల రూపాయలు ఎగవేసినట్లు గుర్తించింది ఈడీ.

ఈ స్కాంకు సంబంధించి ఏపీలో తీగ లాగితే డొంక కదిలినట్లు తెలుస్తోంది. అధికారులతో బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో ఈ కేసును సీరియస్ గా తీసుకుంది ఈడీ. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారుచేశారని.. కోట్లు కొట్టేశారని ఆరోపిస్తోంది ఏసీబీ. ఈ స్కాం ద్వారా వేలకోట్లు చేతులు మారాయని ఆరోపిస్తోంది ఏసీబీ.

ALSO READ : EMIలో ఫోన్లు కొన్నోళ్లకు RBI షాక్..

ఈ స్కాంకు సంబంధించి పశుసంవర్థక శాఖకు చెందిన సీనియర్ అధికారులను అరెస్ట్ చేయగా.. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీపై కూడా కేసు నమోదయ్యింది. గొర్రెల పంపిణీ స్కీం లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని.. కానీ వెయ్యి కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. 

నకిలీ విక్రేతలు, ఫేక్ బిల్లులను మళ్లీ మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్టు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్‌బ్యాక్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.