EMIలో ఫోన్లు కొన్నోళ్లకు RBI షాక్.. లోన్ చెల్లింపు మిస్ అయితే మీ స్మార్ట్ ఫోన్ లాక్..!

EMIలో ఫోన్లు కొన్నోళ్లకు RBI షాక్.. లోన్ చెల్లింపు మిస్ అయితే మీ స్మార్ట్ ఫోన్ లాక్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే రుణ చెల్లింపులు మిస్ అయిన వ్యక్తుల ఫోన్స్ రిమోట్ గా లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతివ్వాలని చూస్తోంది. అయితే ఇది ఈఎంఐలపై తీసుకున్న మెుబైల్ ఫోన్స్ రుణాల చెల్లింపుల విషయంలో మాత్రమేనని వెల్లడైంది. దీంతో చిన్న రుణాల బకాయిలను వసూలు చేయడంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు వీలుంటుందని సెంట్రల్ బ్యాంక్ భావిస్తోంది. 

స్మార్ట్‌ఫోన్స్ వంటి ఉపకరణాలపై తీసుకునే రుణాలు ఎక్కువగా ఉండడంతో.. వాటి ఈఎంఐ ఎగవేతదారుల నుంచి సొమ్ము రికవరీ ఈ విధంగా సులభమవుతుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. అయితే మొబైల్ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసే ముందు లోన్ పొందిన వారి నుంచి అంగీకారాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత డేటాను బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు చూడరాదు.

ALSO READ : ఈ 65 కార్ల ధరలు భారీగా తగ్గాయి..

గతంలో ఏం జరిగింది?
గతంలో RBI ఇదే పద్ధతిని నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు ఈ విధానాన్ని మరొకసారి పునరుద్దరించాలనుకుంటోంది. గత సంవత్సరం ఈ విధానం కొంతమేర నిలిపివేయబడింది. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత రిజర్వు బ్యాంక్ తమ ఫేర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను మార్పులు తెస్తోంది.

కొత్త రూల్స్ ఎవరికి లాభం..
* చిన్న రుణాల బకాయిల వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
* Bajaj Finance, DMI Finance వంటి పెద్ద రుణ సంస్థలకు ఎక్కువ ప్రయోజనకరం.
* చిన్న రుణాల అధిక డిఫాల్ట్ ఉన్న కేసులు తగ్గవచ్చు.