Liquor scam: కవితకు ఈడీ మళ్లీ నోటీసులు : 20న విచారణకు రండి

Liquor scam: కవితకు ఈడీ మళ్లీ నోటీసులు : 20న విచారణకు రండి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Liquor scam case) ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు మరోసారి ఈడీ నోటీసులు పంపింది. మార్చి 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 24న సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. కానీ సుప్రీం విచారణకు ముందే కవిత ఈడీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించింది. కవిత ముందు ప్రస్తుతం మూడు ఆప్షన్లు ఉన్నాయి. మార్చి 20న ఈడీ విచారణకు హాజరుకావడం, ఈడీ సమన్లపై సుప్రీం కోర్టులో స్టే కోరడం, ముందస్తు బెయిల్ కు వెళ్లడం. మరి కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.

మార్చి 16న రామచంద్ర పిళ్లైని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చింది. రామచంద్రపిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కొరింది. ఈమేరకు పిళ్లైకు ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించింది. కవితతో కలిసి విచారించాలి.. అయితే కవిత ఇవాళ విచారణకు హాజరుకాలేదని ఈడీ తెలిపింది. అందర్ని కలిసి విచారిస్తే ఎలా అని స్పెషల్ కోర్టు ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. లిక్కర్ కేసులో కవిత అనుమానితురాలని ఈడీ కోర్టుకు తెలిపింది. కవితను పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ కోర్టును కోరింది.