
పారిశ్రామిక వేత్త సానా సతీష్ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. దీంతో సతీష్ తో సంబంధం ఉన్న తెలుగు ప్రముఖులకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, బిజినెస్ మెన్ చాముండీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది ED.
సానా సతీష్ కేసులో కీలక సమాచారాన్ని ED రాబట్టింది. అయితే గత 2013లో సుఖేష్ గుప్తా బెయిల్ కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదైంది. సతీష్ ఇచ్చిన సమాచారంతో… తనకు ED నోటీసులు జారీ చేసిందంటూ జరుగుతున్న ప్రచారం అంతా అసత్యమన్నారు షబ్బీర్ అలీ. ఇప్పటి వరకు తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఒక వేళ విచారణకు రమ్మని పిలిచినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మాంసం వ్యాపారి ఖురేషీ తనకు ప్యామిలీ ఫ్రెండ్ అని, సానా సతీష్ తో పరిచయం ఉన్నమాట వాస్తవమేనన్నారు షబ్బీర్ అలీ.