నవదీప్కు ఈడీ నోటీసులు

నవదీప్కు ఈడీ నోటీసులు

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని హీరో నవదీప్కు  నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్10న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.  2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులిచ్చారు. గతంలో రెండు సార్లు నోటీసులిచ్చినా హాజరు కాలేదు. మాదాపూర్ డ్రగ్స్ కేసులోసెప్టెంబర్ 23న నార్కోటిక్స్ పోలీసులు నవదీప్ ను దాదాపు 6 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో సంబంధాల విషయంలో నవదీప్ ను విచారించినున్నారు ఈడీ అధికారులు.