Delhi liquor scam : కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

Delhi liquor scam : కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతుంది. మార్చి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆఫీసుకు చేరుకున్న కవితకు.. మిగతా అందరిలాగే ఎంట్రీ బుక్ లో వివరాలు నమోదు చేశారు. మొదటి అరగంట కూల్ కూల్ చేసిన అధికారులు.. ఆ తర్వాత అసలు విషయంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. మొదటి సారి విచారణ కమిటీ ఎదుట హాజరు అవుతుండటంతో.. సహజంగా ఉండే ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు.. మొదటి వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యం వివరాలతో కూల్ చేసినట్లు సమాచారం..

ఆ తర్వాత అసలు వివరాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒకటిన్నర వరకు లిక్కర్ స్కాంకు సంబంధించి వివరాలు రాబడుతున్నారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఏం జరిగింది.. సౌత్ గ్రూపులో మీ పాత్ర ఏంటీ.. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో మీకు వాటాలు ఉన్నాయా లేవా.. అరుణ్ పిళ్లయ్.. బుచ్చిబాబులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. డబ్బుల లావాదేవీలు ఎలా జరిగాయి అనే ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 

అరుణ్ పిళ్లయ్, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా విచారణలోని అంశాలను ప్రస్తావిస్తూ.. నిజమా కాదా అని ప్రశ్నిస్తున్నారంట.. వీటితోపాటు ఎన్ని ఫోన్లు ఉపయోగించారు.. ఆ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది.. ఎన్ని సార్లు ఢిల్లీ వచ్చారు.. ఢిల్లీ వచ్చిన మీరు ఎవరెవరితో సమావేశం అయ్యారు..  లిక్కర్ స్కాం పాలసీ తయారీలో మీ పాత్ర ఏంటీ.. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు మీ గురించి ఎందుకు చెబుతున్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారంట. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు.. సౌత్ గ్రూప్ లోనే ఆరుగురు సభ్యులు ఉన్నారు.. వాళ్లతో మీకు ఉన్న సంబంధాలు ఏంటీ.. మీ ప్రమేయం లేకుండానే వాళ్లు మీ పేరును ఎందుకు ప్రస్తావిస్తారు  అనే ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. సిసోడియా రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవితకు 33 శాతం వాటా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు కదా.. మీకు ఇప్పటి వరకు ఎంత డబ్బు ముట్టింది.. ఇన్నాళ్లు ఎంత లాభం తీసుకున్నారు.. తీసుకున్న డబ్బును ఏ రూపంలో తీసుకున్నారు అనే అంశాలపైనా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది.. 

11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయిన విచారణ.. ఒకటిన్నర గంటల వరకు హాట్ హాట్ గానే సాగినట్లు ఢిల్లీ వీ6 రిపోర్టర్ల నుంచి వస్తున్న సమాచారం...