ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ  మరోసారి నోటీసులిచ్చింది. మార్చి 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ లో మాగుంట కీలక వ్యక్తిగా భావిస్తూ విచారణకు రావాలని కొరినట్లుగా తెలుస్తోంది. కాగా ఇదే కేసులో  మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన  తీహార్  జైలులో ఉన్నాడు. 

అటు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. మార్చి 20న విచారణకు రావాలని కవితను ఆదేశించింది.  కానీ సుప్రీం విచారణకు ముందే రావాల్సిందిగా ఈడీ నోటీసులో వెల్లడించింది. ఇప్పుడు కవిత ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మార్చి 20న ఈడీ విచారణకు హారుకావడం, ఈడీ సమన్లపై సుప్రీం కోర్టులో స్టే కోరడం, ముందస్తు బెయిల్ కు వెళ్లడం.. మరి కవిత ఎలా స్పందస్తుందో చూడాలి.

మార్చి 16న రామచంద్ర పిళ్లైని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చింది. రామచంద్రపిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కొరింది. కవితతో కలిసి విచారించాలి.. అయితే కవిత ఇవాళ విచారణకు హాజరుకాలేదని ఈడీ తెలిపింది. అందర్ని కలిసి విచారిస్తే ఎలా అని స్పెషల్ కోర్టు ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది.