జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించిన ఈడీ

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించిన ఈడీ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడిన సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో జాక్వెలిన్ ను విచారించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంతో జాక్వెలిన్ ఈడీ ఎదుట హాజరైంది. పీఎంఎల్‌ఏ కింద నమోదైన కేసులో జాక్వెలిన్ కు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ ఏప్రిల్‌ నెలలో జప్తు చేయగా, రెండు నెలల అనంతరం ఆమెను మరోసారి విచారించింది. ఈ కేసుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న పలువురిపై ఈడీ ఆరా తీస్తుంది. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్‌ నేతృత్వంలో అక్రమార్కులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తున్నది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ అధారంగా ఈడీ ఈ కేసును విచారిస్తోంది. కాగా ఇదే కేసుకు సంబంధించి మరో నటి నోరా ఫతేహిని కూడా ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది.