సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ సోదాలు

సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జైన్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్‌ కేసులో గత నెల 30న ఈడీ సత్యేంద్ర జైన్ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సోమవారం తెల్లవారుజాము నుంచి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 

కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ఏప్రిల్లో  ఆయనకు సంబంధించి  రూ.4.81కోట్ల విలువైన స్థిరాస్థులను జప్తు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వలేదన్న కారణంతో జైన్పై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో మే 30న అరెస్టైన ఆయనను కోర్టు జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. సత్యేంద్రజైన్ అరెస్ట్పై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ అరెస్టు ఖండించారు. ఆయనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం..

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

మాల విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ