
ICICI బ్యాంక్ మాజీ CEO చందాకొచ్చర్, వీడియోకాన్ MD వేణుగోపాల్ ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. వీడియాకాన్ రుణాలకు సంబంధించిన కేసులో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఐదు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 2012లో వీడియాకాన్ గ్రూప్‌నకు రూ. 3250 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్‌ప్రోకో ప్రాతిపదికన సహాయం చేసినట్లు చందాకొచ్చర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోదీనిపై CBI, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. రుణాల మంజూరుకు ప్రతిగా దీపక్ కొచ్చర్‌కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.