బంగ్లాను ఖాళీ చేయండి..సిసోడియాకు అధికారుల లేఖ

బంగ్లాను ఖాళీ చేయండి..సిసోడియాకు అధికారుల లేఖ

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన అధికార నివాసాన్ని ఖాళీ  చేయాలని అధికారులు లేఖ రాశారు.  మార్చి 21 లోగా బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించారు. మనీష్ సిసోడియా నివాసాన్ని విద్యాశాఖ మంత్రి అతిషికి కేటాయించారు.  

మరో వైపు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌  కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సిసోడియా కస్టడీని మరో ఏడు రోజులు పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఈ కేసులో  మనీష్ సిసోడియాను మరి కొందరితో కలిసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. అయితే రిమాండ్ పొడిగింపు కోసం ED చేసిన అభ్యర్థనను సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సిసోడియా కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది.