ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్(AAP) గోవా అధ్యక్షుడు అమిత్ పాలేకర్కు ED నోటీసులు ఇచ్చింది. అమిత్ తోపాటు రామారావు వాఘ్, దత్తా ప్రసాద్ నాయక్, భండారీ సమాజ్ ప్రెసిడెంట్ అశోక్ నాయక్ లకు నోటీసులు పంపింది ఈడీ. రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులో తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ కు చెందిన ఎమ్మెల్సీ కవితతోపాటు పలువరు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అరెస్ట్ , రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను బుధవారం (మార్చి 27) ఢిల్లీ హైకోర్టు విచారించింది. కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయలేమని చెప్పింది. కేజ్రీవాల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.మరోవైపు కేజ్రీవాల్ కస్టడీ రేపటితో(గురువారం) ముగియనుంది.
