టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ సమన్లు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ సమన్లు

టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశీ కంపెనీలకు మళ్లించినట్టు నామాపై అభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల నామాతో పాటు ఆయనకు చెందిన మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా పత్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీటి ఆధారంగానే నామాకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.