మాల్యా, నీరవ్‌, చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ

మాల్యా, నీరవ్‌, చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ

ఆర్థిక నేరగాళ్లు  విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. అయితే ఆ మోసగాళ్లకు చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌(ED) బదిలీ చేసింది. అంతేకాదు.. ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18,170.02 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. దీంట్లో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి కారణంగా బ్యాంకులకు జరిగిన నష్టంలో వారి ఆస్తులు అటాచ్ చేసి, సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్నట్లు ED చెప్పింది.

నీరవ్, చోక్సీ, విజయ్ మాల్యాలు.. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురూ భారతీయ బ్యాంకుల నుంచి సుమారు రూ.22,585 కోట్లు రుణం తీసుకున్నారు. CBI నమోదు చేసిన FIR ఆధారంగా ED ఈ ముగ్గురికి చెందిన లావాదేవీలను సమీక్షించింది.