ఏదైనా సాధ్యమే మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

ఏదైనా సాధ్యమే మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

ఆధ్యాత్మికత, మానవ సంబంధాల కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఏదైనా సాధ్యమే’.  దైవం తోడుంటే అనేది ట్యాగ్‌‌లైన్.  అనిల్ మునగనూరి  కథ, మాటలు, సాహిత్యం అందిస్తూ నిర్మిస్తుండగా,  మద్దూరి రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం టైటిల్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ మాట్లాడుతూ ‘దేశానికి యువత ఎంతో ముఖ్యం. కానీ చాలామంది నిరాశలో, డిప్రెషన్‌‌లోకి వెళ్లిపోతున్నారు.  

ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా ఎలా మారుతాయో ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం.  ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది’ అని అన్నారు.  

శ్రీ అమ్మ భగవాన్ చెప్పిన  ఐదు సూత్రాల చుట్టూ కథ తిరుగుతుందని దర్శకుడు మద్దూరి రాజా చెప్పాడు.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం సహా టీమ్ అంతా  పాల్గొన్నారు.