గవర్నమెంట్​ స్కూళ్లపై నమ్మకం కల్పించాలి : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

గవర్నమెంట్​ స్కూళ్లపై నమ్మకం కల్పించాలి : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

వంగూర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉపాధ్యాయులు పని చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్  చైర్మన్  ఆకునూరి మురళి పేర్కొన్నారు. బుధవారం వంగూరు జడ్పీ హైస్కూల్, మండలంలోని ప్రైమరీ, హైస్కూల్​ హెచ్ఎంలు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్​ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడంలో భాగంగా సలహాలు, సూచనలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరెంట్స్​కు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే తమ పిల్లల భవిష్యత్​కు ఢోకా ఉండదనే భరోసా కల్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు రంగాపూర్  పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులను పరిశీలించారు. డీఈవో రమేశ్ కుమార్, టీచర్లు లింగమయ్య పాల్గొన్నారు.