జీరో ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కూళ్లకు నో ప్రమోషన్ : స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్

జీరో ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కూళ్లకు నో ప్రమోషన్ : స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టరేట్
  • నిరుడు జూన్ తర్వాత ఏర్పడిన ఖాళీలే ప్రామాణికం 
  • టీచర్ల ప్రమోషన్లకు కీ పాయింట్స్ రిలీజ్ చేసిన విద్యా శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రమోషన్లతో నింపే టీచర్ల ఖాళీల్లో జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లను పరిగణనలోకి తీసుకోరాదని డీఈఓలకు స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టరేట్  స్పష్టం చేసింది. ప్రమోషన్ల కోసం టీచర్ల సీనియారిటీ లిస్టులను రెడీ చేయాలని ఆదేశించింది. హెడ్ మాస్టర్  పోస్టుల  కోసం గవర్నమెంట్, లోకల్ బాడీ (ఎంపీపీ, జెడ్పీపీ) స్కూళ్లకు చెందిన స్కూల్  అసిస్టెంట్ల లిస్టును, స్కూల్ అసిస్టెంట్  పోస్టుల కోసం ఎస్జీటీ సీనియారిటీ లిస్టును 1:3 రేషియాలో సిద్ధం చేయాలని సూచించింది. టీచర్ల ప్రమోషన్  కౌన్సెలింగ్ కు సంబంధించి కూడా గైడ్​ లైన్స్  విడుదల  చేసింది. గతంలో 2023, 2024లో ప్రమోషన్  తీసుకోని టీచర్లు, 2024లో ప్రమోషన్  పొందిన పోస్టులో 15 రోజుల్లో చేరని టీచర్లను ప్రస్తుత సీనియారిటీ లిస్టులో చేర్చాలని పేర్కొంది.

 ఈ నేపథ్యంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో అర్హులైన ఎస్జీటీలు, ఒకే సబ్జెక్టు సీనియారిటీ లిస్టులో తమ పేరు చేర్చేందుకు అండర్ టేకింగ్  ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు నుంచి రివర్షన్  తీసుకున్న టీచర్లు అదే సబ్జెక్టులో ప్రమోషన్ కు అర్హులని, వారికి అర్హతలుంటే ఇతర సబ్జెక్టులకు అర్హులేనని ప్రకటించారు. ఖాళీలను 2025 ఆగస్టు 1 నాటికి కటాఫ్ గా తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. జూన్ 2024 తర్వాత ఏర్పడిన స్కూల్  అసిస్టెంట్లు, లేదా సేమ్  క్యాడర్ల ఖాళీలను ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, దీనిలో 30 శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు, 70 శాతం పోస్టులు ప్రమోషన్లకు కేటాయించాలని సూచించారు.

 అయితే, హెడ్మాస్టర్  పోస్టులు మాత్రం వందశాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవసరమైన ఖాళీలను మాత్రమే ప్రమోషన్ల కోసం లిస్టులు ప్రకటించాలని అధికారులు సూచించారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌లాగ్ ఖాళీలను 70:30 నిష్పత్తిలో లెక్కించకూడదని, అన్ని బ్యాక్‌‌‌‌‌‌‌‌లాగ్  ఖాళీలను సంబంధిత కేటగిరీల కోసం చూపాలని ఆదేశించారు.