ఇయ్యాల్టి నుంచి ఓయూలో ఎడ్యుకేషన్ ఫిల్మ్ ఫెస్టివల్

ఇయ్యాల్టి నుంచి ఓయూలో ఎడ్యుకేషన్ ఫిల్మ్ ఫెస్టివల్

ఓయూ, వెలుగు: కొత్త విద్యా విధానం లక్ష్యాలను అధిగమించేందుకు డిజిటల్ విద్యా విధానం ఒక్కటే మార్గమని కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా చెప్పారు.

ఓయూలో 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు బుధవారం ఆయన హైదరాబాద్​ వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .. ఓయూలో మొదటిసారి ఈ ఫెస్టివల్ ​నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యూజీసీ సీఈసీ నిర్వహించే 24వ ఎడ్యుకేషన్​ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వీడియోలను ప్రదర్శించనున్నామని, అవార్డులు అందజేయనున్నామని చెప్పారు. ఫెస్టివల్ ​పోస్టర్ ను ఓయూ వీసీ రవీందర్ తో కలిసి ఆవిష్కరించారు.