మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగలు

వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. బహార్ పేట చౌరస్తాలో మంత్రి కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాసర ఐఐటీ విద్యార్థుల పట్ల మంత్రి సబిత మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు.

ఇటు పరిగి మార్కెట్ యార్డులో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రిని మహిళలు అడ్డుకున్నారు. పేరుకే మిషన్ భగీరథ, నీళ్లు మాత్రం రావడం లేదంటూ నిలదీసింది ఓ మహిళ. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా పరిగిలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. మొన్న మంత్రి హారీష్ రావు, నిన్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఈరోజు మంత్రి సబితకు వరుసగా నిరసన సెగలు తగిలాయి.