విద్యాసంస్థల భూములు.. రియల్‌‌ ఎస్టేట్‌‌ మాఫియాకు వద్దు : రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

విద్యాసంస్థల భూములు.. రియల్‌‌ ఎస్టేట్‌‌ మాఫియాకు వద్దు : రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: విద్యాసంస్థల భూములను రియల్​ఎస్టేట్​ మాఫియాకు అప్పగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ వర్సిటీకి ప్రభుత్వం1998లో 200 ఎకరాలు కేటాయించిందని, ఇందులో 50 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి కలెక్టర్‌‌ నోటీసు జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నోటీసును వెనక్కి తీసుకొని, తరగతి గదులు, హాస్టళ్లు, అకడమిక్‌‌ బ్లాకులు నిర్మాణానికి నిధులు కేటాయించాలని  డిమాండ్‌‌ చేశారు.