
- వ్యర్థాలు కలువకుండా చూడాలని విన్నపం
మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు: డంపింగ్ వ్యర్థాలు కలవడంతో ఎదులాబాద్ శ్రీలక్ష్మీనారాయణ చెరువు నాశనమవుతోందని ఎదులాబాద్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువును కాపాడాలని కోరుతూ సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డు నుంచి వ్యర్థాలు ఎరిమల్లేవాగు ద్వారా ఎదులాబాద్ చెరువులో చేరుతున్నాయన్నారు.
ఫ్యాక్టరీల రసాయనాలు కూడా ఇందులోనే కలుస్తున్నాయని ఆరోపించారు. దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. చెరువును కాపాడి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.