నేత్రపర్వంగా రాములోరి ఎదుర్కోలు

నేత్రపర్వంగా రాములోరి ఎదుర్కోలు

భద్రాచలం, వెలుగు: రామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామికి గురువారంరాత్రి సంప్రదాయరీతిలో ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవమూర్తులను తొలుత వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. పల్లకిపై ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ మిథిలాస్టేడియం ముఖద్వారం వద్దకు తీసుకొచ్చారు. 

వైకుంఠద్వారం వద్ద రామచంద్రుడిని, మిథిలాద్వారం వైపు సీతమ్మతల్లిని ఎదురెదురుగా ఆసీనులను చేశారు. అయోధ్య నుంచి రాముడు, మిథిలా నుంచి సీతమ్మతల్లి వచ్చినట్లుగావేదపండితులు తెలిపారు. సీతారాముల గుణగణాలను సౌందర్యాన్ని, వంశ గౌరవాన్ని ప్రతిభను ఒకరికి మరొకరు తీసిపోనట్లుగా వర్ణించి ఎంతో ఆసక్తిగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. 

అర్చకులు నృత్యం చేస్తూ పూలమాల లను భక్తుల కరతాళ ధ్వనులు మధ్యమాలా పరివర్తన కార్యక్రమం జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరా వు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే తెల్లం వెంక ట్రావు, మాజీఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఈవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.