V6 News

ఈషాతో కచ్చితంగా భయపెడతాం.. హారర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ నచ్చుతుంది

ఈషాతో కచ్చితంగా భయపెడతాం.. హారర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ నచ్చుతుంది

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌‌‌‌లో శ్రీనివాస్ మన్నె  తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్‌‌‌‌, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కావల్సి ఉండగా, ఈనెల 25కు వాయిదా వేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీ క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చివరకు త్రిగుణ్, హెబ్బా, సిరి, అఖిల్‌‌‌‌లను తీసుకున్నాం. ఈ చిత్రంతో అందరికీ విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు.

తమ సినిమా రిలీజ్‌‌‌‌ లేట్‌‌‌‌ అవుతోంది కానీ భయపెట్టడం మాత్రం కన్ఫర్మ్‌‌‌‌ అని వంశీ నందిపాటి అన్నారు. రిలీజ్ డేట్‌‌‌‌ మారడంతో ప్రమోషన్స్‌‌‌‌కు మరింత సమయం లభించిందని బన్నీ వాస్‌‌‌‌ తెలిపారు. హారర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం నచ్చుతుందని త్రిగుణ్‌‌‌‌ చెప్పాడు.  త్రిగుణ్‌‌‌‌తో రెండోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందని హెబ్బా పటేల్‌‌‌‌ చెప్పింది. దర్శకుడు శ్రీనివాస్‌‌‌‌ మన్నె, నిర్మాత హేమ వెంకటేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్, డీవోపీ సంతోష్  తదితరులు పాల్గొన్నారు.