మద్యం ఆదాయంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తుండు

మద్యం ఆదాయంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తుండు

మంచిర్యాల : టీఆర్ఎస్ను బొంద పెట్టి బీజేపీని గెలిపించుకుంటమని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటున్నాడని ఆరోపించారు. మద్యం ఆదాయంతోనే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తున్నరని విమర్శించారు. సీఎస్ కలెక్టర్లకు ఫోన్ చేసి మరీ మద్యం అమ్మకాలు పెంచాలని ఆదేశాలు ఇస్తున్నాడని ఈటల ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక సీఎం కేంద్రం, మోడీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్న రాజేందర్.. కేసీఆర్ భరతం పట్టే సమయం దగ్గరపడిందని అన్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఈటల విమర్శించారు. ఎన్నికల తర్వాత దళితబంధు ఇస్తానన్న కేసీఆర్ ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అష్టకష్టాలు పడి పిల్లల్ని చదివించినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 

For more news..

పీకే లాంటి వాళ్ళు ఎందరొచ్చినా టీఆర్ఎస్ ను కాపాడలేరు

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం