- అడల్ట్సైట్లతోనూ ఇబ్బందులే .. వెల్లడించిన సర్వే రిపోర్ట్
ముంబై: సినిమా పైరసీ, అడల్ట్ వెబ్‌సైట్లతో చాలా సమస్యలు వస్తాయని తాజా స్టడీ వెల్లడించింది. వీటితో కంప్యూటర్లలో మాల్వేర్ చొరబడుతోంది. అడల్ట్/పోర్న్సైట్ల వల్ల జూదం ప్రకటనల బెడద ఎక్కువగా ఉంటోంది. 57 శాతం జూదం ప్రకటనలు అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. పైరసీ సైట్లను యాక్సెస్ చేయడం వల్ల మాల్వేర్ ప్రమాదం 59 శాతం ఎక్కువగా ఉంటుందని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన స్టడీ వెల్లడించింది. స్టడీ కోసం 18 ఏళ్లు పైబడిన 1,037 మందితో గత ఏడాది మే 23–-29 మధ్య స్టడీ చేశారు.
సినిమాలు, సంగీతం, టీవీ షోలు, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్ వంటి వాటిని పైరసీ సైట్ల నుంచి ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ‘ఈవీ’ రిపోర్టు ప్రకారం 2022లో పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు 3.08 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. భారతదేశంలో ఆన్‌లైన్ పైరసీ లాభదాయకంగా మారింది. పైరసీ సైట్ ఆపరేటర్‌లకు మాల్‌వేర్ పంపిణీ అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. 18-–24 సంవత్సరాల వయస్సు గల వాళ్లు పైరసీ వెబ్‌సైట్లను ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారు. అయితే వీరికి సైబర్ రిస్క్ గురించి అవగాహన ఉండటం లేదు.
