నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి

నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి

కాగ జ్ నగర్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. రెండో విడత ఎన్నికల లో భాగంగా నామినేషన్ ల స్వీకరణ కాగ జ్ నగర్ డివిజన్ లోని పెంచికల్ పేట, చింతలమానెపల్లి , బెజ్జూర్, దహెగాం , సిర్పూర్ టీ మండలాల్లో ప్రారంభం అయింది.అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా తో కలిసి బెజ్జూరు మండలం ఊట్సారంగపల్లి , చింతల మానే పల్లి మండల కేంద్రంలో క్లస్టర్ కేంద్రాలను పరిశీలించారు. 

నామినేషన్ పత్రాల ధృవీకరణ, అభ్యర్థుల వివరాల నమోదు, అవసరమైన రికార్డుల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సమాచారం, ఫిర్యాదులకోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని ,8500844365 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉంటే సిర్పూర్ టీ, కౌ టాల మండల కేంద్రంలో నామినేషన్ స్వీకరణ సెంటర్ లను జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ,సూపరిండెంట్ తోటాజి తో కలిసి పరిశీలించారు.