గండిపేట, వెలుగు: పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తూ భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నార్సింగిలోని ఏఎఫ్ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించిన పట్టభద్రుల సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీశ్‌కు అవకాశం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యాసంస్థల ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరీ సతీష్‌కు తగిన అవకాశం కల్పించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
