Good Health : ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నట్స్ బెటరా.. కోడిగుడ్డు బెటరా

Good Health : ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నట్స్ బెటరా.. కోడిగుడ్డు బెటరా

ఆరోగ్యం.. ఇది ఉంటే చాలు జీవతం హ్యాపీ. ఉదయం లేచింది మొదలు మళ్లీ పడుకునే వరకు ఆయా సమయాల్లో తినే ఫుడ్ విషయంలో ఎన్నో డౌట్స్.. ఉదయం లేవగానే తినే బ్రేక్ ఫాస్ట్ అనేది ఎంతో కీలకం.. ఎందుకంటే మన వర్క్ స్టార్ట్ అయ్యేది ఈ బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే కదా.. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో డ్రైఫ్రూట్స్ బెటరా.. కోడి గుడ్డు బెటరా.. ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.. అనేది సింపుల్ గా తెలుసుకుందాం..

నట్స్.. డ్రై ఫ్రూట్స్.. :

బాదం, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు వంటి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే చాలా ఆరోగ్యం అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వు ఉంటాయి. ఒమెగా 3 యాసిడ్స్ ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది. దీంతో కడుపు నిండుగా.. అన్ని పోషకాలు శరీరానికి పడతాయి. 

కోడి గుడ్డు ఎంత బెటర్ :

ఎగ్.. రోజూ తింటే ఎంతో బలం అనుకుంటాం.. ఇందులో నిజం లేకపోలేదు. విటమిన్ ఏ, డీ, బీ12తోపాటు ప్రొటీన్స్ ఉంటాయి. గుడ్డు వల్ల ఎలర్జీ వస్తుంది.

ఈ రెండింటిలో నట్స్, కోడిగుడ్డులో ఏది బెటర్ అనే సందిగ్ధం వస్తే మాత్రం.. నట్స్ బెటర్ అంటున్నారు న్యూట్రీషియన్స్. రోజూ ఉదయం 25 గ్రాముల నట్స్ తీసుకోవటం వల్ల కోడి గుడ్డు కంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. నట్స్ లోనే ఉండే ఫైబర్ కంటెంట్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.. అదుపులో ఉంచుతుంది.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండటం వల్ల.. ఆకలి కాదు. దీంతో తక్కువ తింటాం.. దీంతో ఆటోమేటిక్ గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు న్యూట్రీషియన్స్. నట్స్ తో పోల్చినప్పుడు కోడిగుడ్డులో తక్కువ స్థాయిలోనే ఫైబర్ ఉంటుంది. సో.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో కోడిగుడ్డు కంటే నట్స్ బెటర్..