గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 8మంది మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 8మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు ఒకదానికి ఒకటి పరస్పరం ఢీకొని 8మంది చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు సోన్‌గంద్‌ దగ్గర ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్‌ ఢీకొన్నాయి. కొద్ది సేపటికే వచ్చిన ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ రాంగ్ రూట్ లో రావడం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు.