ఎనిమిదేళ్ల కుర్రాడితో టాయిలెట్ క్లీనింగ్

ఎనిమిదేళ్ల కుర్రాడితో టాయిలెట్ క్లీనింగ్

మహారాష్ట్రలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల కుర్రాడితో టాయిలెట్ క్లీన్ చేయించారు. ఈ దారుణ ఘటన బుల్ధానాలో జరిగింది. బుల్ధానా జిల్లా సంగ్రాంపూర్ మండలంలోని మారోడ్ గ్రామంలో ఉన్న హైస్కూల్‌లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుచేశారు. అయితే స్కూల్‌లో ఉన్న టాయిలెట్ పూర్తిగా జామ్ అయిపోయింది. దాంతో ఐసోలేషన్ సెంటర్ సిబ్బంది టాయిలెట్ జామ్ అయిన విషయాన్ని పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే టాయిలెట్స్ క్లీన్ చేయించాలని.. సంగ్రాంపూర్ పంచాయత్ సమితీ గ్రూప్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. దాంతో సిబ్బంది ఆ పని కోసం ఓ ఎనిమిదేళ్ల పిల్లాడిని పట్టుకొచ్చారు. పూర్తిగా జామ్ అయిపోయిన టాయిలెట్ నుంచి ఆ చిన్న పిల్లాడితో అశుద్ధం తీయించారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అదికాస్తా ఎలాగో అలాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనకు బాధ్యులైన ముగ్గురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. దర్యాప్తు కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుంటామని అధికారులు చెప్పారు.