మహారాష్ట్ర సంక్షోభంలో కీలక పరిణామం

మహారాష్ట్ర సంక్షోభంలో కీలక పరిణామం

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతున్నాయి. ఆరోపణ, ప్రత్యారోపణలతో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తమపై డిప్యూటీ స్పీకర్ అనర్హత వేయడంపై ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. షిండే క్యాంపులో 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఉద్దవ్ చెబుతుండగానే.. మరో మంత్రి ఉదయ్ సామంత్, ఏక్ నాథ్ షిండే క్యాంపులో చేరిపోయారు. దీంతో షిండే క్యాంపులో చేరిన మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నవ నిర్మాణ్ సేన్ చీఫ్ రాజ్ఠాక్రేతో ఏక్నాథ్ షిండే రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్లు ఎంఎన్ఎస్ నేతలు తెలిపారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారన్నారు. అదేవిధంగా రాజ్ఠాక్రే ఆరోగ్య పరిస్థితిపై షిండే ఆరాతీసిన్నట్లు చెప్పారు. కాగా రాజ్ఠాక్రే 2006లో శివసేన నుండి వైదొలగి నవ నిర్మాణ్ సేన్ ను స్థాపించారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం డిశ్చార్జీ అయ్యారు. కాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు శివసేన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని షిండే ట్వీట్ చేశారు.