అలా బయటకు వెళ్తే ఆయుష్షు పెరుగుతుంది

అలా బయటకు వెళ్తే ఆయుష్షు పెరుగుతుంది

రొటీన్‌‌‌‌ లైఫ్‌‌‌‌.. యువతకే కాదు పెద్దోళ్లకూ చిరాకును కలిగిస్తుంది . ఆట విడుపు కోసం పిల్లలకు, పెద్దలకు ఎన్నో వ్యాపకాలు ఉంటాయి. ఆ వ్యాపకాలతో రొటీన్‌‌‌‌ లైఫ్‌‌‌‌ నుంచి బయటకు రావచ్చు. మరి వృద్ధుల పరిస్థితి వేరుగా ఉంటుంది . కాబట్టి వాళ్లను బయటకు కాసేపు తీసుకెళ్తే మనసు హుషారుగా ఉంటుంది . దాంతోపాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది .సరిగ్గా ఇదే మాట చెప్తుంది జోర్నల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది అమెరికన్‌‌‌‌ జేరియాట్రిక్స్‌‌‌‌ సొసైటీ. రోజూ ఇల్లు దాటి కాసేపు అలా వెళ్లొస్తే చాలు వృద్ధుల ఆయుష్షు పెరుగుతుందని స్పష్టం చేసింది.ఇబ్బందులు, వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ, బయట కాసేపు గడిపితే మానసికంగా, శారీరకంగానూ బాగుంటారు.అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కిడ్నీ సమస్యలవంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు కూడా రోజూ బయటికి వెళ్లడం తో పెరిగినట్లు తెలిసింది. రోజూ బయటికి వెళ్లడం ద్వారా బాహ్య ప్రపంచంతో అనుబంధం ఏర్పడుతుంది. జీవన ప్రమాణం పెరగడానికీ, తద్వారా ఆయుష్షు పెరగడానికీ కారణమవుతుంది. అప్పుడప్పుడు అరుదుగా బయటకు వెళ్లే వృద్ధులు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడైంది.