యాదాద్రి(బీబీనగర్), వెలుగు: సర్ పేరుతో ఎన్యూమరేషన్ ఫారం చెక్ చేస్తామని ఇద్దరు యువకులు కలిసి ఓ వృద్ధురాలి బంగారు గొలుసు తీసుకొని పరారయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన ఆండాలు ఇంటికి ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చారు. సర్ ఎన్యూమరేషన్ ఫారం చెక్ చేస్తామని, ఇందుకోసం ఫొటో తీసుకుంటామని చెప్పారు.
మెడలో బంగారం ఉంటే ఫొటో సరిగా రాదని చెప్పి గొలుసును తీయించి తీసుకున్నారు. అనంతరం వృద్ధురాలి దృష్టి మరల్చి రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసుతో పరారవడంతో ఆండాలు కన్నీరుమున్నీరవుతోంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
