రూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలేవి?

రూ.లక్ష స్కీం రాకుండా  చేస్తున్న ఆఫీసర్లపై చర్యలేవి?

కారేపల్లి, వెలుగు: బీసీ కులవృత్తుల దారులకు ప్రభుత్వం అందించే రూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేదరులు ఎంపీడీవో ఆఫీస్​ఎదుట సోమవారం నిరసన తెలిపారు. బుట్టలు, చేటలు అల్లుతూ ఆందోళనకు దిగారు. ఆన్​లైన్ చేసిన మేదరుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారించిన ఆఫీసర్లు దరకాస్తులను రిజెక్టు చేస్తున్నామని చెప్పడంతో ఈ నిరసన చేపట్టామన్నారు. 

Also Read :-ప్లాంటేషన్ లో మొక్కలు నరికినవారిపై కేసు

మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు వాసం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చందా మాట్లాడుతూ కుల వృత్తులపైనే ఆధారపడి జీవించే తమకు రూ.లక్ష స్కీం రాకుండా చేయడం దారుణమన్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రోగ్రాంలో సంఘం నాయకులు ఎ. శ్రీనివాస్​, పిల్లి. వెంకటేశ్వర్లు, పోతు నర్సింహరావు, కొనం వెంకటేశ్వర్లు, ఎనమనగండ్ల రవి, కనికరపు ప్రసాద్, పోతు రమాదేవి పాల్గొన్నారు.