తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కోడ్ బ్రేక్ చేయనుందా..?

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కోడ్ బ్రేక్ చేయనుందా..?

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. పదేండ్ల పండుగను ఊరువాడలా నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్. వేడుకల్లో గీతంతో పాటు రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది.    

  ఈ క్రమంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కోడ్ అడ్డంకి కానుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే జూన్ 2న  రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేపట్టింది  ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాకా తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. జూన్ 4వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ దేశమంతా అమల్లో ఉండనుంది.  జూన్ 1న  లోక్ సభ ఎన్నికలు మొత్తం ముగియనున్నాయి.

 అయితే ఫలితాల వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఇక ఎన్నికలు జూన్ ఒకటిన ముగియడంతో..జూన్ 2న జరిగే రాష్ట్ర అవిర్భావ దినోత్సవానికి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.