అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్ 

చెన్నూరు, వెలుగు : అభివృద్ధి పనులు త్వరగా చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మిస్తుందన్నారు. అనంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వంటశాల, ఇతర మరమ్మత్తు పనులను పరిశీలించారు. పట్టణంలో అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణం, ఇతర పనులను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. 

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి..

నస్పూర్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, బాలల సంక్షేమ కమిషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్​తోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ఆపరేషన్ స్మైల్ అమలుపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం శ్రీనిధి రుణాలు, బ్యాంకు లింకేజ్ ల మంజూరు, రికవరీపై జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, శ్రీనిధి సిబ్బంది, సామాజిక సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు.