క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, నస్పూర్, కడెం, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించిన టార్చ్​ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో విద్యార్థులు, యువకులు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సీఎం కప్ క్రీడలు టార్చ్ ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. 

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, అధికారులతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్​పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచించారు.