ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డీఎం రాజశేఖర్ అధ్యక్షతన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రమాదాల రహిత ప్రయాణం సాగించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు.
డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. వాహనం నడిపేటప్పుడు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బందితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్, జిల్లా రవాణాశాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
