హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సవరించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా.. జమ్మూకాశ్మీర్ తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 

తమ మూలపురుషుడు గురు జంబేశ్వరుడి స్మారకంగా బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు అసోజ్ అమవాస్య పండగను నిర్వహిస్తారు. అక్టోబర్ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతో పాటు, పంజాబ్, రాజస్థాన్ కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సిర్సా, ఫతేహాబాద్, హిస్సార్‌‌లలో నివసిస్తున్న వేలాది బిష్ణోయ్ కుటుంబాలు రాజస్థాన్‌‌కు వెళనున్నారు.  ఈ క్రమంలో ప్రజలు ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.