- షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
- ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు రేపటి నుంచే నామినేషన్లు
- ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోసం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుండగా.. ప్రతి ఫేజ్ మధ్య రెండు రోజుల వ్యవధి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు, జగిత్యాల జిల్లా 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు, పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి.
పెద్దపల్లి జిల్లాలో..
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్
కె.శ్రీరాంపూర్ పాలకుర్తి సుల్తానాబాద్
కమాన్‌పూర్ అంతర్గాం ఎలిగేడు
రామగిరి ధర్మారం పెద్దపల్లి
ముత్తారం జూలపల్లి ఓదెల
మంథని
కరీంనగర్ జిల్లాలో..
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్
గంగాధర చిగురుమామిడి వీణవంక
రామడుగు తిమ్మాపూర్ ఇల్లందకుంట
చొప్పదండి గన్నేరువరం జమ్మికుంట
కొత్తపల్లి మానకొండూరు హుజూరాబాద్
కరీంనగర్(రూ) శంకరపట్నం వి.సైదాపూర్జ
గిత్యాల జిల్లాలో..
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్
మేడిపల్లి జగిత్యాల ధర్మపురి
భీమారం జగిత్యాల (రూ) బుగ్గారం
కథలాపూర్ రాయికల్ ఎండపల్లి
కోరుట్ల సారంగాపూర్ వెల్గటూర్
మెట్‌పల్లి బీర్పూర్ గొల్లపల్లి
ఇబ్రహీంపట్నం మల్యాల పెగడపల్లి
మల్లాపూర్ కొడిమ్యాల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్
రుద్రంగి బోయినిపల్లి ఎల్లారెడ్డిపేట
వేములవాడ ఇల్లంతకుంట వీర్నపల్లి
వేములవాడ(రూ) తంగళ్లపల్లి ముస్తాబాద్
కోనరావుపేట - గంభీరావుపేట
చందుర్తి
