హుజురాబాద్‎లో ఎలక్షన్ కోడ్.. రోడ్ షోలు, ర్యాలీలకు నో పర్మిషన్ 

హుజురాబాద్‎లో ఎలక్షన్ కోడ్.. రోడ్ షోలు, ర్యాలీలకు నో పర్మిషన్ 

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే నెల 30 జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 2న వెలువడనున్నాయి. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. బైపోల్ ప్రచారంలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 

ఇంటింటి ప్రచారానికి ఐదుగురే
‘ఉప ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు.. మోటార్, బైక్, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు. ఇంటింటికీ ఐదుగురు మాత్రమే ప్రచారం చేసుకోవాలి. పోలింగ్‌కు 72  గంటల ముందు ప్రచారం ముగించాలి. లెక్కింపు సమయంలో ఏడు టేబుల్స్‌ను ఒక హాల్‌‌లో ఉంచాలి. ఈ క్షణం నుంచి కరీంనగర్, హన్మకొండ జిల్లాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంటాయి. పోలింగ్‌కు ఈవీఎంలు రెడీగా ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,269 ఓటర్లు ఉన్నారు. 4,988 కొత్త ఓటర్లు ఉన్నారు. 80 సంవత్సరాలు దాటిన వారు 4,540 మంది ఉన్నారు. కరోనా పాజిటివ్‌గా ఉన్న వారికి పోలింగ్ రోజు చివరి గంటలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తాం’ అని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. 

రాజకీయ పార్టీలతో త్వరలో మీటింగ్
‘బోగస్ ఓట్లపై కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ అంశం మీద విచారణ చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించాం. కౌంటింగ్ ఏజెంట్, పోలింగ్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ డబుల్ డోస్ వేసుకుని ఉండాలి. ఇవాళ్టి నుంచి హుజూరాబాద్‌‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ప్రభుత్వ పథకాలను యథావిధిగా అమలు చేసుకోవచ్చు. ఈ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలతో త్వరలోనే ఒక మీటింగ్ నిర్వహిస్తాం’ అని శశాంక్ గోయల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

పక్కా ప్లాన్‌తోనే మారణకాండ.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

తెలంగాణ సాధించిన సారుకు.. సర్కారు చేసిన సన్మానం!

తగ్గేదేలే.. పవన్‌కు మంత్రి పేర్నినాని కౌంటర్