
తెలంగాణలో కౌంటింగ్‌నకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజంట్లకు సెల్ ఫోన్ లకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు.. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న ఎన్నికలు నిర్వహించగా... జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర నాలుగంచల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు, ఏజెంట్లు ..ఉదయం 7 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది,
పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించేందుకు 19 కౌంటింగ్ కేంద్రాలు,276 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే 135 స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. మూడు చోట్ల 24 రౌండ్లు ఉన్నాయన్నారు. యాకుత్ పుర, చొప్పదండి, దేవరకొండలో 24 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందన్నారు. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు కౌంటింగ్ పూర్తిఅయ్యే అవకాశం ఉందని వికాస్ రాజ్ తెలిపారు. సర్వీసు ఓటర్ల కోసం కేటాయించిన ఇటిపిబి ఓట్ల లెక్కింపు కూడా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. వీటికోసం వేరేగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోసం ఇవిఎం ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే ప్రత్యేక క్యాబిన్‌లను ఏర్పాటు చేశారు. ఫలితాలను ప్రకటించడానికి ప్రతీ లెక్కింపు కేంద్రంలో బోర్డులను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలవద్ద నాలుగంచెల భద్రతా వ్యవస్థను, బారికేడింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీచోటా తనిఖీలు నిర్వహిస్తారు.