ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి

ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి
  •      నియోజకవర్గ వ్యయపరిశీలకుడు సాయన్ దే బర్మ

సూర్యాపేట, వెలుగు : ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయపరిశీలకుడు సాయన్ దే బర్మ అధికారులకు సూచించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ లో కలెక్టర్ ఎస్.వెంకట్​రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో నియమించిన బృందాలు నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పెయిడ్ ఐటమ్స్ కు రేట్ కార్డు ప్రకారం ఖర్చు అభ్యర్థి ఖాతాలో జమ చేయాలన్నారు.

ప్రకటనలకు అభ్యర్థులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో 213 పోలింగ్ కేంద్రాల్లో 2,59,096 మంది ఓటర్లు భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నారని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 31 సమస్యాత్మక ప్రాంతాల్లో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.

సమావేశంలో  అడిషనల్​కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్ మీనా, అడిషనల్​ఎస్పీ నాగేశ్వరావు, తహసీల్దార్లు, బ్యాంకు అధికారులు, పోస్టల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.