జూలై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

 జూలై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

గోవా, గుజరాత్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు 2023 జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. వెస్ట్ బెంగాల్ లో ఆరు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక్క స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.  అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జులై 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, జూలై 13లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  

జులై, ఆగస్టు నెలల్లో పదవీ కాలం ముగియబోతున్న రాజ్యసభ సభ్యుల వివరాలు :

1. వినయ్ టెండూట్కర్, గోవా

2. దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, గుజరాత్

3. జుగల్‌సింహ్ మాథుర్, గుజరాత్

4. సుబ్రహ్మణ్యం జైశంకర్, గుజరాత్

5. డెరెక్ ఒబ్రెయిన్, పశ్చిమ బెంగాల్

6. డోలా సేన్, పశ్చిమ బెంగాల్

7. ప్రదీప్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్

8. సుస్మిత దేవ్, పశ్చిమ బెంగాల్

9. శాంత ఛేత్రి, పశ్చిమ బెంగాల్

10. సుఖేందు శేఖర్ రే, పశ్చిమ బెంగాల్

గుజరాత్ నుంచి గెలిచిన బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యం జైశంకర్, దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, లోఖండ్‌వాలా జుగల్‌సింహ్ మాథుర్‌ల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. గోవా బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పదవీ కాలం జూలై 28తో ముగుస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి గెలిచిన టీఎంసీ రాజ్యసభ సభ్యులు డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుస్మిత దేవ్, శాంత ఛేత్రి, సుఖేందు శేఖర్ రే, కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్యల పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. అటు ఫెలీరో పదవీ కాలం 2026 ఏప్రిల్ 2 వరకు ఉంది. కానీ ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 11న రాజీనామా చేశారు.

గత ఏడాది జులైలో జరిగిన చివరి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో విజయం సాధించింది.