హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో పోలీస్​ పెత్తనం!.. ఓటు లేకున్నా రంగంలోకి ఉన్నతాధికారి

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో  పోలీస్​ పెత్తనం!.. ఓటు లేకున్నా రంగంలోకి ఉన్నతాధికారి
  • తన వాళ్లున్న ప్యానెల్ను గెలిపించాలంటూ ఫోన్లు 
  • పరిధి దాటి క్లబ్ సెక్రటరీలు, మెంబర్లతో మీటింగ్ నిర్వహణ
  • పోలీస్ ఉన్నతాధికారి జోక్యంపై హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ క్లబ్ మెంబర్ల ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) ఎన్నికల వేడి మొదలైంది. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 20న ఎన్నిక, కౌంటింగ్ జరగనుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ మొత్తం ఆరు పోస్టులకు పలు ప్యానెళ్లు బరిలో నిలిచాయి. కొన్నాళ్లుగా గాడి తప్పిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఈ ఎన్నికల తర్వాత అయినా గాడిన పడుతుందని యంగ్ క్రికెటర్లు ఆశలుపెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓ సీనియర్ పోలీస్ అధికారి అతి జోక్యంపై పోటీలో ఉన్న పలు ప్యానెళ్లు మండిపడుతున్నాయి. తన వాళ్లను గెలిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఈసారి ఓట్లు వేసే క్లబ్ మెంబర్ల కంటే బయటివాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. ప్రముఖులు, పోలీస్ ఆఫీసర్లకు ఓటు లేకున్నా తమ దగ్గర మనుషులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో తమ పవర్ వాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఓటర్లు, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళన

సిటీలోని క్లబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా సంఘాలు, మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు కలిపి 173 మంది ఓటర్లతో ఎన్నికల అధికారి ఓటర్ లిస్ట్ విడుదల చేశారు. వీరిలో చాలామందికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ కాల్స్ రావడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. సంఘంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఫోన్లు చేసి ఒత్తిడి చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి పోటీలో నిలిచే పానెల్స్ రకరకాల ప్రయత్నాలు చేయడం మామూలే. కానీ, దీనికి భిన్నంగా ఏ సంబంధం లేని పోలీస్ ఆఫీసర్ తన పవర్ చూపించడం, తాను చెప్పిన వారికే ఓటేయాలని హుకుం జారీ చేయడం మెంబర్లలో చర్చకు దారితీసింది. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత సపోర్ట్ ఉందంటూ మరో ప్యానెల్ వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు తన వెనుక ఉన్నారని మెంబర్లు, క్లబ్ సెక్రెటరీలకు ఆయన చెప్పుకుంటున్నారు. మరో క్రీడా అసోసియేషన్ లో ఉన్న ఆయన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏలోనూ పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో బయటివాళ్ల జోక్యం బాగా పెరిగిందని  మెంబర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటివాళ్ల పెత్తనం ఎక్కువైతే మొదటికే మోసం వస్తుందన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే యువ ఆటగాళ్ల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని పేరెంట్స్  సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దోస్తు కోసం ఓట్ల వేట..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ స్నేహితుడు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన కోసం ప్రస్తుతం హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏతో ఏ సంబంధం లేని సదరు ఆఫీసర్ ఓట్ల వేటలో పడ్డారు. ఈ మధ్యే క్లబ్ మెంటార్లతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి తన మనిషినే గెలిపించాలని చెప్పినట్లు సమాచారం. తనకు అధికార పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ కి రాని వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు కొందరు సభ్యులు చెబుతున్నారు. తాను చెప్పినట్లు చేస్తే ఎలక్షన్ తర్వాత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏలో పోస్టులు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని కూడా ఆ పోలీస్ ఆఫీసర్ వారికి హామీ ఇస్తున్నట్టు సమాచారం.