కండక్టర్ నిజాయితీ : రూ.3.47కోట్లు అప్పగించాడు

కండక్టర్ నిజాయితీ : రూ.3.47కోట్లు అప్పగించాడు

తమిళనాడు :ఎన్నికల సమయంలో కట్టలనోట్లు కుప్పలుగా దొరుకుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు సీక్రెట్ గా డబ్బును తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో ఏడు సంచుల్లో డబ్బును తరలిస్తున్న వ్యక్తి..పొరపాటుగా ఆ సంచులను మరిచిపోయి బస్సు దిగిపోయాడు. బస్సులో ఎక్కువగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరూ కూడా ఆ సంచులను పట్టించుకోలేదు. బస్సు లాస్ట్ స్టాప్ వచ్చేసరికి ఆ ఏడు సంచులు మిగిలాయి.

ఇది గమనించిన బస్సు కండక్టర్ సంచులను తెరిచి చూడగా..అందులో అన్ని నోట్ల కట్టలే. షాక్ అయిన కండక్టర్ ఈ విసయాన్ని డ్రైవర్ కు చెప్పి, నిజాయితీగా ఆ డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించాడు. ఇంతకీ ఆ డబ్బు మొత్తం ఎంతో తెలుసా..అక్షరాల రూ.3.47 కోట్లు. ఇంత డబ్బును నిజాయితీగా తెచ్చి ఇచ్చిన కండక్టర్ సెల్వరాజ్ ను అభినందించారు ఎన్నికల అధికారులు. ఈ సంఘటన బుధవారం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగింది.