కాశ్మీర్లో ఈ ఏడాదిలోపే ఎలక్షన్స్ పెట్టాలె

కాశ్మీర్లో ఈ ఏడాదిలోపే ఎలక్షన్స్ పెట్టాలె

పరిస్థితిని దిగజార్చే నిర్ణయం తీసుకోవద్దు

 ప్రధానిని మోడీని కలిసిన   ఫరూక్​ అబ్దుల్లా టీమ్​ ​

న్యూఢిల్లీ:జమ్మూకాశ్మీర్లో ఈ ఏడాది ముగిసేలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి నేషనల్​కాన్ఫరెన్స్​చీఫ్​ ఫరూక్​అబ్దుల్లా ఆధ్వర్యంలోని టీమ్​విజ్ఞప్తి చేసింది. కాశ్మీర్​వ్యాలీలో పరిస్థితిని మరింత దిగజార్చేందుకు దారితీసే ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని కోరింది. ఫరూక్​ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఆయనతో 20 నిమిషాల పాటు చర్చలు జరిపింది. తర్వాత జమ్మూకాశ్మీర్ ​మాజీ సీఎం ఒమర్​అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల భయాందోళనల గురించి ప్రధానికి వివరించామని చెప్పారు.

గత ఏడాది కంటే ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో అతికష్టం మీద పరిస్థితి మెరుగుపడిందని, కానీ, ఏ సమయంలోనైనా అది క్షీణించవచ్చన్నారు. ఆర్టికల్​35ఏను రద్దు చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నందున, దాని గురించి ప్రధానితో మాట్లాడారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పరిస్థితిని దిగజార్చే ఏ స్టెప్​కూడా తీసుకోరాదని తాము చెప్పామన్నారు. అంటే ఆర్టికల్35ఏ, ఆర్టికల్370, ఇతర అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుందన్నారు.  ప్రధాని ఏం చెప్పారన్నది వెల్లడించేందుకు నిరాకరించిన ఒమర్.. తమ మధ్య మీటింగ్​సంతృప్తికరంగా జరిగిందంటూ సమాధానం దాటవేశారు.