వచ్చే ఏడాది ఎలెక్రామా

వచ్చే ఏడాది ఎలెక్రామా

హైదరాబాద్, వెలుగు:   ఇండియన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (ఐఈఈఎంఏ) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ షో అయిన ఎలెక్ట్రామా 16వ ఎడిషన్​ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 26  వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. 

రీఇమేజినింగ్ ఎనర్జీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్” అనే థీమ్​తో దీనిని ఏర్పాటు చేస్తారు.   పర్యావరణానికి మరింత మేలు చేసేలా ఉత్పత్తి సాధించడంపై ఈ సందర్భంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు,  వాటాదారులు ఈ విషయాల గురించి మాట్లాడుతారు.   ఈ కార్యక్రమానికి 100కుపైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. 20 బిలియన్​ డాలర్ల విలువైన బిజినెస్​ ఎంక్వైరీలు వస్తాయని అంచనా.