ఏడాది లీజుకు ఎలక్ట్రిక్ బైక్

ఏడాది లీజుకు ఎలక్ట్రిక్ బైక్

హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ 12 నెలల వరకు లీజ్
అఫర్డబుల్ ఫైనాన్సింగ్ ఆప్షన్లు ఆఫర్

న్యూఢిల్లీ: వెహికల్ లీజింగ్ స్టార్టప్ ఓటీఓ క్యాపిటల్‌‌తో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు అఫర్డబుల్, ఫ్లెక్సి బుల్ ఫైనాన్సింగ్ ఆప్షన్లను ఆఫర్ చేసేందుకు ఈ పారన్టర్‌ ‌‌‌షిప్ కుదుర్చుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా.. ఓటీఓ క్యాపిటల్ మినిమమ్ 12 నెలల వరకు ఎలక్ట్రిక్ టూవీలర్‌‌‌‌ను కస్టమర్లకు లీజ్‌కు ఇవ్వనుంది. ఆ తర్వాత టూవీలర్ కస్టమర్లు మరో మోడల్‌‌కు అప్‌గ్రేడ్ కావొచ్చని కంపెనీ తెలిపింది. ఓటీఓ క్యాపిటల్ ద్వారా ఫ్లెక్సి బుల్ లీజింగ్ మోడల్‌‌ను ఆఫర్ చేస్తున్నామని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ చెప్పారు. ఈ మోడల్ ద్వారా ఇంటర్నల్ కంబస్సన్ ఇంజిన్(ఐసీఈ) వెహికల్స్‌‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌లోకి మార్చుకోవచ్చు. సరికొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్లను అడాప్ట్ చేసుకోవడంతో టూవీలర్ సెగ్మెంట్ మొత్తం ప్రయోజనం పొందనుందని గిల్ తెలిపారు. కొనుగోలు ప్రక్రియను సరళతరం చేయనున్నామని, ఆన్‌లైన్ బుకింగ్స్‌‌ను, హోమ్ డెలివరీలను ఆఫర్ చేయనున్నామని అన్నారు . దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారులు పెరగనున్నారని చెప్పారు.ఈ పారన్టర్‌ ‌‌‌షిప్ బెంగళూరు, పుణేలలో 16 హీరో ఎలక్ట్రిక్ డీలర్స్‌‌లో అందుబాటులో ఉంటుంది. వచ్చే కొన్ని నెలల్లో దేశమంతా అందుబాటులోకి వస్తుందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. వచ్చేకొన్ని నెలల్లో వెయ్యి బైక్‌లు లీజ్‌కు పోనున్నాయని భావిస్తున్నామని ఓటీఓ క్యాపిటల్ కో ఫౌండర్ సుమిత్ ఛాజెడ్ చెప్పారు. అన్ని సెగ్మెంట్లలో టూవీలర్లకు అఫర్డబుల్ ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్లకు కన్జూమర్ల నుంచి డిమాండ్ వస్తుందని తెలిపారు. ఈ పారన్టర్‌‌‌‌షిప్ ద్వారా నెలకు 30 శాతం వరకు సేవింగ్స్ చేపట్టవచ్చని చెప్పారు. ఉదాహరణకు, హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ఎల్ఐ కాస్ట్ ఓటీఓ క్యాపిటల్ ద్వారా నెలకు రూ.2,478గా ఉంటే, ట్రెడిషినల్ బ్యాంక్ ఈఎంఐ నెలకు రూ.3,520గా ఉంది. లీజింగ్ కాలం 12 నెలల నుంచి 36 నెలలుగా ఉంది.

For More News..

హైదరాబాద్‌ లో తొలిసారిగా.. టై గ్లోబల్ సమ్మిట్ 2020

తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా కేసులు

కరోనా డ్రగ్‌ ఆర్డరిస్తే ఇంటికే..ఎక్కడో కాదు మనదగ్గరే..